ప్రభుత్వ వెబ్ సైట్లులో సమాచారం తొలిగింపుపై చర్యలు తీసుకోండి : కేటీఆర్

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్, సీఎస్ శాంతి కుమారికి ‘ఎక్స్‌’వేదికగా మరోసారి విజ్ఞప్తి చేశారు.

ktr
X

తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపైన సీఎస్ శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని సమాచారం, వివరాలు తొలగించారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని తెలంగాణ చరిత్రలో భాగమని వాటి కాపాడాలని కోరారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని, పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ సీఎంగా పరిపాలన సాగించారని కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని వేల కొలది ఫొటోలు, వీడియోలను వెబ్సైట్లు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారని కేటీఆర్ కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ‘ఎక్స్‌’వేదికగా మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అవసరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story