నీట్‌ వ్యవహారంలో కేంద్రం, ఎన్టీఏలకు సుప్రీం నోటిసులు

నీట్‌, యూజీ వ్యవహారం పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్డీఏకు నోటీసులు జారీ చేసింది.

నీట్‌ వ్యవహారంలో కేంద్రం, ఎన్టీఏలకు సుప్రీం నోటిసులు
X

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌)-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.వేర్వేరు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పిటిషన్‌ వేసింది. నీట్‌, యూజీ వ్యవహారం పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్డీఏకు నోటీసులు జారీ చేసింది. అలాగే నీట్‌ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయిని, పేపర్‌ లీక్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జులై 8వ తేదీకి వాయిదా వేసింది.

నీట్'లో గ్రేస్ మార్కులు కలపాలన్న ఎన్‌టీఏ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నీట్‌ కౌన్సిలింగ్‌ ఆపేది లేదని, కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫలితాల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపింది. వారికి మళ్లీ జూన్‌ 23న పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపిన విషయం విదితమే.

Raju

Raju

Writer
    Next Story