తూనికలు కొలతల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

తూనికలు కొలతల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
X

తూనికలు కొలతల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సెక్రటేరియట్‌ లో తూనికలు కొలతల శాఖ పై ఆయన సమీక్ష నిర్వహించారు. పెట్రోల్‌ బంక్‌ లతో పాటు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వేయింగ్‌ మిషన్లపై నిఘా పెట్టాలన్నారు. తద్వారా ప్రజలు మోసాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, ఎక్కడ అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. డిపార్ట్‌మెంట్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు డీఎస్‌ చౌహాన్‌, ప్రియాంక, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story