మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్‌ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది.

మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్‌ భేటీ
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. అసెంబ్లీ కమటీ హాల్‌లో జరిగే ఈ భేటీలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రి కీలక నిర్ణయం తీసుకోనున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తెల్లరేషన్‌ కార్డునే ప్రమాణికంగా తీసుకుంటున్నది. దీంతో కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్‌ వస్తున్నది. ప్రభుత్వం ప్రజావాణి పేరుతో కొత్త రేషన్‌కార్డుల కోసం, ఆరు గ్యారెంటీల లబ్ధి కోసం స్వీకరించిన దరఖాస్తులు అటకెక్కాయి. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరు గ్యారెంటీలపై, కొత్త రేషన్‌కార్డులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అర్హులందరికీ తెల్ల రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈమేరకు పౌర సరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు.

వీటితో పాటు కేబినెట్‌లో ఔటర్‌ రింగు రోడ్డు వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే అంశం, కొత్త వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, జాబ్‌ క్యాలెండర్‌, ప్రజావాణి దరఖాస్తులు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, మీర్‌ఖాన్‌పేట వద్ద స్కిల్‌ యూనివర్సిటికీ సీఎం భూమి పూజ చేయనున్నారు.

శాసనసభ, మండలిలో పలు అంశాలపై స్వల్ప కాలిక చర్చ

నేడు శాసనసభలో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది. హైదరాబాద్‌లో సుస్థిర పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్‌ యూనివర్సిటీ, సివిల్‌ కోర్టుల చట్ట సవరణ, తెలంగాణ చట్టాల బిల్లులపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. వరుసగా ఐదో రోజు కూడా శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి.బిల్లులపై అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలిలో చర్చ జరుగుతుంది.

Raju

Raju

Writer
    Next Story