స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధం : భట్టి

సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని డిప్యూటీ సీఎం భట్టి అని ప్రశ్నించారు.

Samitha sabgraval
X

అఖిల భారత సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లు విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. స్మితా వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని భట్టి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అభిప్రాయపడ్డారు.

రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడవద్దని, రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో విద్యావిధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్య కంటే మెరుగైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ఒక్కో పాఠశాల కోసం రూ.80 నుంచి 100 కోట్లు ఖర్చు చేయబోతోందని వెల్లడించారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని చెప్పారు.

Vamshi

Vamshi

Writer
    Next Story