పార్లమెంటు ముందుకు ఆరు కొత్త బిల్లులు

ఈ నెల 23న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆరు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది.

పార్లమెంటు ముందుకు ఆరు కొత్త బిల్లులు
X

ఈ నెల 23న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆరు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఫైనాన్స్‌ బిల్లు -2024 సభా ముందుకు రానున్నది. అనంతరం సభా కార్యకలాపాలు వాయిదా పడనున్నాయి.

విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్‌ బిల్లు, అసందిగ్ధతలను తొలిగించి మరింత స్పష్టత ఇవ్వడానికి ఉద్దేశించిన భారతీయ వాయుయాన్‌ విధేయక్‌-2024, ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం-1934లో ఉన్న బిల్లులు సభ ముందుకు రానున్నాయి. దేశీయ కాపీ రబ్బర్‌ పరిశ్రమలను ప్రోత్సహించడానికి కాఫీ ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు-2024, రబ్బర్‌ ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు-2024 సభ ముందు పెట్టి ఆమోదించనున్నారు.

అటు పార్లమెంటు అజెండాను నిర్ణయించే బీఏసీని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్ల ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో బీజేపీ తరఫున అనురాగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ తరఫున గౌరవ్‌ గొగోయ్‌, టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు., టీఎంసీ తరఫున సుదీప్ బందోపాధ్యాయ్, డీఎంకే తరఫున దయానిధిమారన్‌ ఉన్నారు.

Raju

Raju

Writer
    Next Story