సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్

ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు దగ్గర ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్‌ రన్‌ చేశారు.

Sitarama project
X

భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. ఆగస్టు15 నాటికి సాగర్ లింక్ కెనాల్‌కు అనుసంధానించి గోదావరి జలలు అందించేందుకు సర్వం సిద్దమైంది. ప్రాజెక్ట్ మొదటి పంప్ హూస్ వద్ద ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్బంగా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజేక్టు ద్వారా ఖమ్మం,భద్రాది, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే.

సీతారామ ప్రాజెక్ట్ కు 2016 ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్ధ్యంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయి. వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు పారేలా చర్యలు సాగుతున్నాయి. మరోవైపు నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మల కొత్తగూడెంలో పర్యటించనున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story