కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌‌పై సంచలన నిర్ణయం

కోలీవుడ్‌లో మహిళా నటీమణులు, సిబ్బంది ఎదుర్కొంటున్న క్యాస్టింగ్‌ కౌచ్‌‌పై కమిటీ వేస్తున్నట్టు తమిళ నడిగర్ సంఘం ప్రకటించింది.

Tamil actor
X

కోలీవుడ్‌లో మహిళా నటీమణులు, సిబ్బంది ఎదుర్కొంటున్న క్యాస్టింగ్‌ కౌచ్‌‌పై కమిటీ వేస్తున్నట్టు తమిళ నడిగర్ సంఘం ప్రకటించింది. హీరోయిన్‌లు మహిళ ఆర్టిస్టుల పని ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణాన్ని కల్పించేందుకు కొన్ని మార్గదర్శకాలు అవసరమని నడిగర్ సంఘం అధ్యక్షులు నాజర్ తెలిపారు. వాటన్నిటి మీద నడిగర్ సంఘానికి క్షుణ్ణమైన అవగాహన కోసం 'జస్టిస్ హేమ కమిటీ' తరహా కమిటీని వేస్తున్నామని ప్రకటించారు. అంతవరకు నటీమణులు, సిబ్బంది మీడియా ముందు కాకుండా నడిగర్ సంఘం ఇప్పటికే వేసిన అంతర్గత సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు.

కంప్లైంట్ నిజమని తేలితే వారిపై ఐదేళ్ల నిషేధం విధిస్తామని తెలిపింది. కమిటీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని.. కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం పూర్తి విధి విధానాలను రూపొందిస్తామని పేరొన్నారు. కాగా దీనిపై తమిళ చిత్ర పరిశ్రమలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి కన్నడ చిత్ర పరిశ్రమలోనూ.. ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీమణులు, సామాజిక కార్యకర్తలు వినతి పత్రం అందించారు. దీనిపై సిద్దరామయ్య సానుకూలంగా స్పందించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story