మైనారిటీ గురుకుల స్కూళ్లను ఎత్తేసేందుకు సర్కార్‌ కుట్ర

రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని, అందుకే ముస్లిం లకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ మైనారిటీ విభాగం నేత ఇంతియాజ్‌ విమర్శించారు.

మైనారిటీ గురుకుల స్కూళ్లను ఎత్తేసేందుకు సర్కార్‌ కుట్ర
X

మాయ మాటలు చెప్పి అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మైనారిటీలకు ఒక మంత్రి పదవి గాని, ఎమ్మెల్సీ గాని ఇవ్వలేదు. మైనారిటీలు ఓట్లు వేయడానికే ఉన్నారా? అని బీఆర్‌ఎస్‌ మైనారిటీ విభాగం నేత ఇంతియాజ్‌ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ నేత బైకాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమ్మద్‌ అలీ దానిష్‌లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ...

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటింది. ఇప్పటివరకు మైనారిటీ ల సంక్షేమం కోసం ఒక్క సమీక్ష చేయలేదు.మైనారిటీల కోసం మేము ఉన్నామని ఒక్క మాట చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ హామీలు అడ్డగోలుగా ఇచ్చారు. సబ్ ప్లాన్ పెడుతామన్నారు. రూ. 4000 కోట్లు ఇస్తామన్నారు. నాడు పీసీసీ అధ్యక్షుడు గా ఉన్న రేవంతే నేడు ముఖ్యమంత్రి గా ఉన్నారు. నాడు మైనారిటీలకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి? సబ్ ప్లాన్ ఎప్పుడు తెస్తున్నారు? అదనంగా రూ. 1000 కోట్లు కేటాయిస్తామ హామీ సంగతి ఏమైందని ప్రశ్నించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.మైనారిటీ విద్యార్థులకు ఉన్నత చదువు కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. అందులో విజిలెన్స్ అధికారులు ఔట్ సోర్సింగ్ పద్దతిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియమించింది . ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళను తొలిగించింది. దీంతో రానున్న రోజుల్లో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఎత్తి వేసేందుకు ప్రభుత్వం కుట్రలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది ఆరోపించారు. హజ్ యాత్రలో సైతం కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మైనారిటీ డిక్లరేషన్ పై ఒక్క పథకం అమలు చేయలేదు. మైనారిటీ లకు రావాల్సిన బడ్జెట్ ఇవ్వడం లేదు. నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్న ముస్లిం మేధావులు ఎక్కడ ఉన్నారు? ఇవాళ మన ముస్లింలను పట్టించుకోవడం లేదు ఎందుకు అడగడం లేదని అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని, అందుకే ముస్లిం లకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మైనారిటీ లకు చాలా పెద్ద పీట వేశారు.మహమూద్ అలీ కి రెవెన్యూ మంత్రి ఇచ్చారు.నాడు కేసీఆర్‌ 100 శాతం సబ్సిడీ కింద లక్ష రూపాయలు, మహిళలకు కుట్టు మిషన్ లు అందజేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ కింద డబ్బులు కలెక్టర్ ల ఖాతాలో ఉన్నాయి. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కుట్టు మిషన్ లపై కేసీఆర్ ఫొటో ఉన్నదని మిషన్ ల పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. మీ ఫొటో పెట్టుకొని ఇవ్వండి మాకు అభ్యంతరం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు.ఓవర్సీస్ స్కాలర్ షిప్ పెట్టారు ఇలా అనేక పథకాల అమలు చేశారు మరి మీరు ఎందుకు చేయడం లేదు.

Raju

Raju

Writer
    Next Story