ఇన్‌స్టాలో సమంత పోస్ట్ వైరల్..పర్సనల్ లైఫ్‌ గురించేనా?

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. ఈ రోజు గెట్ రెడీ సంథింగ్ స్పెషల్ న్యూస్ చెబుతా అంటు ఇన్‌స్టాలో పేర్కొన్నది.

Sammu
X

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. ఈ రోజు గెట్ రెడీ సంథింగ్ స్పెషల్ న్యూస్ చెబుతా అంటు ఇన్‌స్టాలో పేర్కొన్నది. అలాగే ఓ వాడిపోయిన ఆకులున్న కొమ్మ పిక్‌ను పెట్టింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అది చూసిన ఫ్యాన్స్‌ పర్సనల్ లైఫ్‌ గురించేనా బిజినెస్ అప్డేట్ ఇస్తుందా? అని మాట్లాడుకుంటున్నారు. అలాగే నాగచైతన్య లాగా, ఎంగేజ్మెంట్ సమంత కూడా చేసుకుని చెప్తుందా? అదే గుడ్ న్యూస్ చెప్పనుందా అని చర్చలు జరుగుతున్నాయి. కానీ కొందరు మాత్రం కొత్త సినిమా గురించి చెప్తుందని అంటున్నారు.

అయితే హీరో నాగచైతన్య మాత్రం సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల సడెన్‌గా యంగ్ బ్యూటీ శోభితతో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నిహీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక వారం రోజుల పాటు వీరిద్దరు గురించి చర్చలు జరిగాయి. ఇదిలా ఉంటే.. సమంత కూడా ఓ ప్రముఖ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. కానీ ఫ్యాన్స్ మాత్రం అందులో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సమంత సోషల్ మీడియాలో పోస్టు హాట్ టాఫిక్‌గా మారింది.

Vamshi

Vamshi

Writer
    Next Story