మిస్సైల్స్‌, డ్రోన్లతో కీవ్‌పై రష్యా భీకర దాడి

భారీ క్షిపణులను, డ్రోన్లను రష్యా వరుసగా ప్రయోగించిందని అందులో నాలుగింటిని ఎఫ్‌-16 ఫైటర్లతో కూల్చివేశామన్న కీవ్‌

మిస్సైల్స్‌, డ్రోన్లతో కీవ్‌పై రష్యా భీకర దాడి
X

రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్‌ అందుకున్న ఎఫ్‌-16 యుద్ధ విమానాల్లో ఒకదానిని పుతిన్‌ సేనలు పేల్చివేశాయి. ఈ ఘటనలో పైలట్‌ చనిపోయాడు. భారీ క్షిపణులను, డ్రోన్లను రష్యా వరుసగా ప్రయోగించిందని అందులో నాలుగింటిని ఎఫ్‌-16 ఫైటర్లతో కూల్చివేశామని.. అదే సమయంలో ఒక ఎఫ్‌-16 కూలిపోయిందని కీవ్‌ సైన్యం తెలిపింది.

ఉక్రెయిన్‌ ఇప్పటివరకు సోవియెట్‌ కాలం నాటి యుద్ధవిమానాలను ఉపయోగిస్తున్నది. రష్యా దగ్గర అత్యాధునిక యుద్ధ విమానాలు ఉండటంతో కీవ్‌ విజ్ఞప్తి మేరకు పాశ్చాత్య దేశాలు 60 విమానాలు అందించడానికి అంగీకరించాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు 6 యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు డెలివరీ చేశాయి.

మరోవైపు గురువారం ఉక్రెయిన్‌పై రష్యా దళాలు 5 మిసైల్స్‌, 74 షాహిద్‌ డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో రెండు క్షిపణులను ఉక్రెయిన్‌ గగన తలంలోనే కూల్చివేసింది. రష్యా ప్రాంతాలైన రోస్టోవ్‌, కిరోవ్‌ ప్రాంతాల్లో చమురు గిడ్డంగులపై ఉక్రెయిన్‌ దాడులు చేసినట్లు క్రెమ్లిన్‌ వెల్లడించింది. క్రిమియాపై దాడులకు యత్నించగా తిప్పికొట్టినట్లు ప్రకటన విడుదల చేసింది.

Raju

Raju

Writer
    Next Story