రహదారుల విస్తరణ పనులను వెంటనే చేపట్టాలి..ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు.

RRRR
X

తెలంగాణలో రహదారుల నిర్మాణంపై నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనులను 2 నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రహదారులకు భూసేకరణ ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందని రేవంత్ రెడ్డి కలెక్టర్లను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ ధరల మధ్య భారీ వ్యత్యాసంతో రైతులు ముందుకు రావట్లేదని కలెక్టర్లు తెలిపారు.

దీంతో భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.. భూములు కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబర్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్మూర్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌కు ప్రభుత్వ భూములను కేటాయించాలని, హైదరాబాద్‌-మన్నెగూడ పనులు త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు .హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ వెంటనే చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story