కేసీఆర్ మార్కు లేకుండా చేయాలని రేవంత్ కుట్ర : కొప్పుల ఈశ్వర్

గురుకుల పాఠశాల వల్ల కుటుంబ మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు.. అంటే రేవంత్ రెడ్డి ఈ గురుకుల పాఠశాలలను రద్దు చేస్తామని చెప్పకనే చెప్పినట్టు ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

కేసీఆర్ మార్కు లేకుండా చేయాలని రేవంత్ కుట్ర : కొప్పుల ఈశ్వర్
X

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విచిత్రంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియతో మాట్లాడారు. సీఎం రేవంత్ ఎదో స్టడీ రిపోర్ట్ పేరిట గురుకుల విద్యను చిన్నాభిన్నం చేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ గురుకుల విద్యను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు ..నేను సంక్షేమ మంత్రిగా పని చేశా ..అనేక రాష్ట్రాలకు మన గురుకులాలు ఆదర్శంగా మారాయి ..ఎందరో పేద పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండటానికి కేసీఆర్ పటిష్టం చేసిన గురుకుల విద్యే కారణమన్నారు.

ముఖ్యమంత్రి ఎదో స్టడీ రిపోర్ట్ పేరిట గురుకుల విద్యను చిన్నాభిన్నం చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే గురుకుల విద్యను నాశనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఈశ్వర్ హెచ్చారించారు. కేసీఆర్ మార్కు లేకుండా చేయాలని సీఎం కుట్ర పన్నారని ఆయన అన్నారు. టి ఎస్ స్థానం లో టీజీ తెచ్చాడు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుడు కాదని ఆయనకు తెలంగాణ చరిత్ర తెలియదు కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story