తగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన కొనుగోళ్లు

బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.

తగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన కొనుగోళ్లు
X

బడ్జెట్‌ తర్వాత దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. స్థానిక మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర సుమారు రూ. 5 వేల వరకు తగ్గింది. బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గించడమే దీనికి కారణం. బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రానున్న రోజుల్లో పండుగల సీజన్‌ ప్రారంభమవుతుండటం, శ్రావణ మాసంలో పెండ్లిళ్లు ఉంటాయి. దీంతో బంగారం కొనడానికి జనం పోటీపడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే దాదాపు 20 శాతం వరకు డిమాండ్‌ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పసిడి ధర భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

బంగారం అక్రమ రవాణాను అరికట్టడానికి సుంకం తగ్గించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేంద్రం బడ్జెట్‌లో తగ్గించింది. దీంతో బడ్జెట్‌ తర్వాత 10 గ్రాముల బంగారంపై రూ. 5 వేల వరకు తగ్గింది. అలాగే వెండి ధర కూడా కిలోకు రూ. 7 వేల మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 84 వేలు పలుకున్నది.

Raju

Raju

Writer
    Next Story