విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధం: జగదీష్‌రెడ్డి

విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు.

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధం: జగదీష్‌రెడ్డి
X

విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ' విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్‌ వేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నది. ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీనే సమాధానం ఇచ్చామనన్నారు. దీనిపై శ్వేత పత్రాలు కూడా విడుదల చేశామని తెలిపారు.

విద్యుత్‌ ఒప్పందాలపై విచారణ కోసం రేవంత్‌ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ వేసింది. ఆయనపై మాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. తెలంగాణవాదిగా ఆయనకు పేరు ఉన్నది. కమిషన్‌ సందేహాలకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. కానీ కమిషన్‌ ఉద్దేశం వేరేలా ఉన్నది. వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తున్నదని అందుకే నరసింహారెడ్డి కమిషన్‌కు విచారణ అర్హత లేదని, కమిషన్‌ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాలని కేసీఆర్‌ సూచించారు.

అందుకే కమిషన్‌ పాత్రపై కేసీఆర్‌ అనుమానాలు

వివరణ ఇవ్వడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదు. 15 లోపే ఇవ్వాలన్నారు. 15 వ తేదీ వరకు సమయం ఇచ్చి 11 వ తేదీన ఎట్లా మీడియా సమావేశం ఏర్పాటు చేశారని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్నజస్టిస్‌ నరసింహారెడ్డి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణ మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ కాంగ్రెస్,బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. అందుకే కమిషన్‌ పాత్రపై కేసీఆర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ చేసే అర్హత కమిషన్‌ చైర్మన్‌ కోల్పోయారని లేఖ రాశారని మాజీ మంత్రి చెప్పారు.

అవినీతి జరిగితే కేంద్రం నిజాలు బయటపెట్టాలి

ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నాం. ఛత్తీడ్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం చేసుకున్నాం. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్‌ సింగ్ కు ఏమైనా లంచం ఇచ్చారా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం ఏమైనా అవినీతి జరిగితే కేంద్రం నిజాలు బయటపెట్టాలన్నారు. కేసీఆర్ వివరణ తీసుకున్నాక ఛత్తీస్ ఘడ్ వాళ్లను పిలిస్తే బాగుండేదన్నారు. 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశాం. ఈ రోజుకు రామగుండం,భూపాలపల్లి, కొత్తగూడెం,విజయవాడ, ఆర్టీపీసీ నుండి సబ్ క్రిటికల్టె క్నాలజీ ద్వారానే విద్యుత్ఉ త్పత్తి అవుతుంది. పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ బి.హెచ్.ఈ.ఎల్ కు భద్రాద్రి,యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించాం. ఇలా విద్యుత్‌ విషయంలో పారదర్శకంగా వ్యవహరించామని, కానీ కావాలనే కేసీఆర్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Raju

Raju

Writer
    Next Story