షూటింగ్‌లో రవితేజకు గాయం..ఆరు వారాలు విశ్రాంతి

మాస్ మహారాజా రవితేజకు 67 ప్రాజెక్ట్ షూటింగ్‌లో కుడిచేతికి గాయం అయ్యింది.

Ravi teja
X

మాస్ మహారాజా రవితేజకు 67 ప్రాజెక్ట్ షూటింగ్‌లో కుడిచేతికి గాయం అయ్యింది. అయితే నొప్పిభ‌రిస్తునే షూటింగ్‌లో పాల్గోన్నాడు. సినిమా షూటింగ్ అనంత‌రం ఈ గాయం ఎక్కువ కావడం వల‌న మూవీ యూనిట్ ఆయ‌న‌ను హైదరాబాద్‌లో ఆస్పత్రికి త‌ర‌లించారు. ర‌వితేజ‌ను పరిశీలించిన వైద్యులు ఆయ‌న‌కు శస్త్రచికిత్స చేసి, ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మాస్ మహారాజాకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది.

ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. ఇలాంటి సమయంలో షూటింగ్ లో గాయం బారిన పడ్డాడు హీరో రవితేజ. అయితే ఈ ఆగస్టులో మిస్టర్ బచ్చన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన రవితేజ.. నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా తన 75 సినిమా చేస్తున్నాడు రవితేజ.

Vamshi

Vamshi

Writer
    Next Story