ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి

ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాది. మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది.

Rama krishana reddy
X

ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా వైజాగ్‌లో ప్రజా రవాణ సౌకర్యాన్ని విస్తరించాడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనలో మెట్రో డిజైన్లు, డీపీఆర్, నిర్మణ పనులపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో వైజాగ్, విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2014లో రామకృష్ణారెడ్డిని అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా నియమించారు.

దీంతో రామకృష్ణారెడ్డినే డీపీఆర్‌లు సిద్దం చేశారు. అనూహ్యంగా 2019లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టారు. 2021 వరకూ మెట్రో రైలు పట్టాలెక్కలేదు. అయితే పోర్టులపై రామకృష్ణారెడ్డికి ఉన్న అనుభవం దృష్ట్యా మారిటైమ్ బోర్డుకు సీఈవోగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.. కానీ రామకృష్ణారెడ్డిపై మరొకరిని అధికారిగా నియమించారు. దీంతో ఆయన రాజీనామా చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story