మరో మూడు రోజులు వర్షాలు.. అధికారులూ అప్రమత్తం: సీఎస్‌

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం శాంతికుమారి తెలిపారు.

మరో మూడు రోజులు వర్షాలు.. అధికారులూ అప్రమత్తం: సీఎస్‌
X

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం శాంతికుమారి తెలిపారు. వర్షాలపై కలెకర్టలు, ఎస్పీలు, సీపీలతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

వర్షాలకు చెరువులు, కుంటలు తెగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరితో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్ తెలిపారు. మండలాల వారీగా అధికారులు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామని ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ తెలిపారు.

అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌ హెచ్చరించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించామని శాంతికుమారి తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story