రాహుల్‌...మొహబ్బత్ కా దుకాణ్ ఇదేనా? కేటీఆర్‌

రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతుంటే.. ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తున్నదని ధ్వమెత్తిన కేటీఆర్‌

రాహుల్‌...మొహబ్బత్ కా దుకాణ్ ఇదేనా? కేటీఆర్‌
X

పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, హరీశ్‌ రావు నివాసంపై కాంగ్రెస్ గూండాల దాడిని పిరికిపందల చర్యగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దాడిని తీవ్రంగా ఖండించారు.గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారు, సరైన సమయంలో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారని తెలిపారు.ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతుంటే.. ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తున్నదని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ వల్లే వేస్తున్న మొహబ్బత్ కా దుకాణ్ ఇదేనా? రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటించుకున్న ఆయన చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా అనికేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story