మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం

మెదక్ జిల్లా నర్సాపూర్ కొల్చారం మండలంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చేలరేగింది

Konda Surekha
X

మెదక్ జిల్లా నర్సాపూర్ కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చేలరేగింది. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు. కొల్చారం మండలంలో బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎలాంటి అధికారం లేనివారు వేదికపై ఉన్నారని ఎంఎల్‌ఎ సునీతారెడ్డి ప్రశ్నించారు. స్థానిక ఎంపిటిసి, అధికారులను వేదికపై ఎందుకు ఆహ్వానించలేదని సునీతారెడ్డి అడిగారు. దీంతో సునీతా రెడ్డి, కొండా సురేఖ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మంత్రి కొండా సురేఖ వెనుదిరిగారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్‌బుక్స్, దుస్తుల పంపిణీ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story