చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరనస ఎదురైంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకుని కోడిగుడ్లతో దాడి చేశారు.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
X

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరనస ఎదురైంది. షాబాద్‌లో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయడానికి ఆయన వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకుని కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నాటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల నుంచి కాలె యాదయ్య నిరసన ఎదుర్కొంటున్నారు. ఆయన పార్టీలోకి రావడానికి కాంగ్రెస్‌ కార్యర్తలు వ్యతిరేకిస్తున్నారు. దీక్షలు చేశారు. ఆయన పేరుతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

Raju

Raju

Writer
    Next Story