ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌

సీఎం ఛాంబర్‌ ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బైటికి పంపారు.

ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌
X

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని అసెంబ్లీలో హరీశ్‌రావు అన్నారు. వర్గీకరణ కోసం బీఆర్‌ఎస్‌ చేసిన కృషి తక్కువ చేసేలా సీఎం చేసిన కామెంట్లపై హరీశ్‌ ధీటుగా స్పందించారు. సభ కౌరవుల సభలాగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ సభ కౌరవుల సభను తలపిస్తున్నది. అంతిమంగా గెలిచేది పాండవులు.. నిలిచేది ధర్మమే అన్నారు. అధికారపక్షం అధికారపక్షం అహంకారంతో చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టును స్వాగతిస్తుందన్నారు.

అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. అసెంబ్లీలో తమకు మాట్లాడనివ్వకుండా సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. సీఎం క్షమాపణ చెప్పేవరకు సీఎం ఛాంబర్‌ ముందే కూర్చుంటామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బైటికి పంపారు. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారు. వాహనంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు బైటికి తీసుకెళ్లారు.

Raju

Raju

Writer
    Next Story