వద్దనుకున్న 'రెడ్డి' పేరుతోనే ప్రొఫెసర్ ప్రమాణ స్వీకారం

గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొపెసర్ కోదండరాం ,అమీర్ అలీ ఖాన్ లతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.

వద్దనుకున్న రెడ్డి పేరుతోనే ప్రొఫెసర్ ప్రమాణ స్వీకారం
X

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అంటే పరిచయం అక్కరలేని పేరు. పౌర హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన కోదండరామ్‌ గానే అందరికీ సుపరిచితులు. ఆయనను ఎవరైనా కోదండరామ్‌రెడ్డి అన్నా అంగీకరించరు. ఇటీవల కాలంలో ఓ మీడియా ఛానల్‌లో కోదండరామ్‌రెడ్డి అని సంబోధించినందుకు మధ్యలోంచి లేచి వెళ్లిపోయారు. అలా వద్దనుకున్న రెడ్డి పేరుతో ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తూ.. 'తెలంగాణ శాసన పరిషత్‌ సభ్యుడినైనా ఎం. కోదండరామా రెడ్డి అనే నేను సభా నియమకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.' అని ప్రమాణం చేశారు.

చెవిలో పాఠం చెప్పిన ఎమ్మెల్సీ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం అనంతరం మండలి మీడియా పాయింట్ లో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మీడియా తో ఏం మాట్లాడాలో కోదండరామ్ చెప్పారు. మొదట గవర్నర్ కు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన చెవిలో చెప్పిన ప్రొఫెసర్.. ప్రభుత్వానికి, మండలి చైర్మన్ కు మొదట కృతజ్ఞతలు చెప్పిన అమీర్ అలీ ఖాన్.. గవర్నర్ కు కూడా కృతజ్ఞతలు చెప్పాలని సూచించి అమీర్ అలీ ఖాన్ తో చెప్పించిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్.

Raju

Raju

Writer
    Next Story