ప్రాధాన్యం గల ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలి: ఉత్తమ్‌

ప్రాధాన్యం గల ప్రాజెక్టు ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రాధాన్యం గల ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలి: ఉత్తమ్‌
X

ప్రాధాన్యం గల ప్రాజెక్టు ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని జల సౌధలో నీటి పారుదల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ.. ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రాధాన్య ఉన్న ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని, నీటి పారుదల శాఖ కు నిధుల కేటాయింపులు బాగున్నాయి.. పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పనులు లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలి. అప్పగించిన పనులను సకాలంలో పూర్తయేలా చూసే బాధ్యత అధికారులదేనని, ఎట్టి పరిస్థితులలో పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.

ఆపరేషన్, మెయింటెనెన్సు సమగ్రంగా సమర్థవంతంగా జరగాలి..ప్రతి రోజు కాలువలు పరిశీలన వర్ధకాలంలో చేపట్టాలాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కాలువలు మరమ్మతులు, వరద నివారణ తదితర పనులు సమర్థవంతంగా చేపట్టాలి. పనులు వేగంగా, పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రతి 15 రోజుల ఒకసారి రాష్ట్ర స్థాయి సమీక్ష చేస్తామని మంత్రి తెలిపారు.

పనులు మంచిగా పూర్తి చేసిన వారిని గుర్తిస్తామని పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారుకమిట్మెంట్, సిన్సియర్టీ తప్పకుండా ఉండాలన్న మంత్రి ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లలు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. పనులు బాధ్యతగా చేయాలి.. పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటవెంటనే పూర్తిచేయాలని, ప్రజా ధనం అత్యంత విలువైనది .. ప్రతి పైసా చాలా జాగ్రత్తగా వ్యయం చేయాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story