ప్రధాని ప్రసంగంలో మరోసారి ఉమ్మడి పౌర స్మృతి అంశం

బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో అమలుకు ప్రయత్నించి ప్రజల నిరసనతో వెనక్కి తగ్గిన ఆ అంశాన్ని మళ్లీ ఎందుకు మోడీ ముందుకు తెస్తున్నదనే చర్చ జరుగుతున్నది.

ప్రధాని ప్రసంగంలో మరోసారి ఉమ్మడి పౌర స్మృతి అంశం
X

బీజేపీ దీర్ఘకాలిక డిమాండ్లు అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మతి. మొదటి రెండు తమ పదేళ్ల పాలనలో పూర్తి చేసిన బీజేపీ ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెరమీదికి తెస్తున్నది. అనేక ఏళ్లుగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఉమ్మడి పౌర స్మతి అంశాన్ని ప్రస్తావిస్తున్నది. మహిళలకు ఆస్తి హక్కు, దత్తత హక్కు, మహిళలకూ సమాన సంరక్షణ హక్కులు ఇవ్వడానికి, విడాకుల చట్టంలో వివక్షను తొలిగించడానికి, బహు భార్యత్వానికి స్వస్తి పలికేందుకు, తప్పనిసరిఆ రిజిస్టర్‌ చేసేందుకు అన్ని సంప్రదాయాల్లోని ప్రగతిశీల సంప్రదాయాల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించే బాధ్యతను తీసుకోవాలని బీజేపీ 1998 తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితేఊ 21 వ లా కమిషన్‌ ఈ దశలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమైనదీ కాదు.. వాంఛనీయమూ కాదని పేర్కొన్న విషయాన్ని గమనించాలి. అందుకే ఉమ్మడి పౌర స్మృతికి బదులు వివక్షాపూరిత చట్టాలపై తాము దృష్టి సారించామని తన సంప్రదింపుల పత్రంలో తెలిపింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చాక అమలు చేయడానికి యత్నించినప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు బీజేపీకి 300 పైగా సీట్లు వస్తే లౌకిక పదాలను తొలిగిస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యానించిన అనంత్ కుమార్ హెగ్డేకు మొన్నటి ఎన్నికల్లో టికెట్‌ కూడా ఇవ్వలేదు. అలాగే రాజ్యాంగంపై, ఒక మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చాలామందికి టికెట్లు నిరాకరించింది.

ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రధాన నరేంద్రమోడీ తన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఉమ్మడి పౌర స్మృతికి 'లౌకిక' అనే పదాన్ని జోడిస్తూ దేశాన్ని సెక్యులర్‌ సివిల్‌ కోడ్‌ అవసరం అన్నారు. దేశం 75 ఏళ్ల వివాక్షపూరిత కమ్యూనల్‌ సివిల్‌ కోడ్ కింద మగ్గిపోయిందన్నారు. సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు పౌరస్మృతిపై చర్చలు జరిపి, దేశంలోని సింహభాగం ప్రజలు ప్రస్తుత సివిల్‌ కోడ్‌ వివక్షాపూరితమైనదని భావిస్తున్నందున దీనిపై ఆదేశాలు జారీ చేసిందని ప్రధాని చెప్పారు. దానిని నెరవేర్చడం మన కర్తవ్యం అన్నారు. కామన్‌ సివిల్‌ కోడ్‌పై దేశంలో విస్తృత చర్చ జరగాలని నమ్ముతున్నాను. మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్న చట్టాలకు ఆధునిక సమాజంలో ఎలాంటి స్థానం లేదన్నారు. కమ్యూనల్‌ సివిల్ కోడ్‌ కింద మనం 75 ఏళ్లు గడిపామని, ఇప్పుడు సెక్యూలర్‌ సివిల్‌ కోడ్‌ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పడు మాత్రమే మనం మత ప్రాతిపదికన కొనసాగుతున్న వివక్ష నుంచి సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న వ్యత్యాసాల నుంచి విముక్తి కాగలమని ప్రధాని చెప్పారు.

హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవు. అందుకే మరోసారి ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాన్ని ప్రధాని తెరమీదికి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్న చట్టాలకు స్థానం లేదంటూనే మెజారిటీ వాదాన్ని వినిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన క్రిమినల్‌ చట్టాల గురించి అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటి గురించితో పాటు కేంద్ర ప్రభుత్వం తెచ్చి వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాల గురించి విస్తృతంగా చర్చించకుండానే పార్లమెంటులో సంఖ్యా బలం ఉన్నదని ఆమోదింపజేసుకున్నది. ఇప్పడూ ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నదే వాదన ఉన్నది.

Raju

Raju

Writer
    Next Story