రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం

Praja-vani
X

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రజా వాణి కార్యక్రమం తిరిగి ప్రారంభంకానుంది. రేపటితో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది.

లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story