ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరుకు జరగాల్సిన మెయిన్స్ రాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

APPSC
X

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరుకు జరగాల్సిన మెయిన్స్ రాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష ఈ ఏడాది మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌-1 ప్రాథ‌మిక‌ పరీక్ష నిర్వహించారు. ఇక ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన విడుదల‌య్యాయి.

ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకుంటే, వారిలో 1,26,068 మంది హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక‌, వీరిలో 91,463 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. పరీక్ష జరిగిన 24 రోజుల వ్య‌వ‌ధిలోనే ఏపీపీఎస్సీ కమిషన్‌ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గ‌తంలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.ఈ ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అర్హత సాధించారు. వీరితోపాటు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో ట్యాంపరింగ్, ఓఎంఆర్‌ షీట్‌పై బుక్‌లెట్‌ సీరియల్‌ నంబర్లు లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల 567 మంది అభ్యర్ధులు ఏపీపీఎస్సీ రిజెక్టు చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story