కేటీఆర్, హరీశ్‌రావులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

జాబ్‌ క్యాలెండర్‌ పేరిట నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా మోసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.

KTR
X

హైదరాబాద్ గన్‌ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట నిరుద్యోగులను శాసన సభ సాక్షిగా మోసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కేటీఆర్‌ మధ్య వాగ్వాదం నెలకొంది. అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపే హక్కు లేదా.. ఇదేనా ప్రజాపాలన అని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారిని బస్సులో తరలించారు. కాగా బస్సులోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన చెప్పారని.. రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాహుల్‌ తెలంగాణకు రావాలని.. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా రేవంత్ సర్కార్ వెనుక బీఆర్‌ఎస్‌ పడుతుందని చెప్పారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా తప్పకుండా వారికి అండగా ఉంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story