కవులు తమ కలాలకు పదును పెట్టాలి: హరీశ్‌

ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతామని కళాకారులు కూడా సామాజిక బాధ్యతగా పోరాడాలని, మళ్లీ మీ పెన్నులకు పదును పెట్టాలని హరీశ్‌ కోరారు.

కవులు తమ కలాలకు పదును పెట్టాలి: హరీశ్‌
X

కష్టాల్లో నుంచి పాటలు వచ్చాయి. రైతుల వ్యథల్లో నుంచి పాటలు వచ్చాయి. నీళ్ల కోసం కూడా పాటలు వచ్చాయి. సదాశివుడు రాసిన పాట కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందింది. ఆయన రాసిన 'తలాపున పారుతుంది గోదారి నీ చేను నీ చెలకా ఎడారి' పాట తెలంగాణ నీళ్ల గోస ను చూపెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రవీంద్రభారతిలో గోదావరి గొంతుక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార సభసభ జరిగింది. 2022 సంవత్సరానికి మోహన్‌ రుషి, 2023 సంవత్సరానికి పసునూరి శ్రీధర్‌ బాబులకు హరీశ్‌ రావుల చేతుల మీదుగా అవార్డులు అందించారు.



ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ..ఏ ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పని చేశామని అన్నారు.తెలంగాణ వచ్చాక ఎర్రటి ఎండలో కూడా మత్తల్లు దూకిన చెరువులు కనిపించాయి. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం. కానీ ప్రస్తుత ప్రభుత్వ తీరుతో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.ఇప్పుడు గోదావరి ఎండిపోయింది.ఇది కొంచెం బాధ కలిగే అంశం అన్నారు. పది పదిహేను రోజుల నుంచి గోదావరి నీళ్ళు వస్తున్న ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయటం లేదు. దీనిపై కనీసం ప్రభుత్వం కు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.కాంగ్రెస్‌ మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చింది అన్నారు. ఇది ప్రభుత్వం పై నిందలు వేయటం కాదు, రైతుల కన్నీళ్ళు తుడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.




మళ్లీ రాష్ట్రంలో కవులకు తమ కలాలకు పదును పెట్టాల్సిన అవసరం వచ్చిందేమో అన్నారు. ఎందుకంటే రోజు పేపర్లు చూడగానే రైతులు ఆత్మహత్యలు కనబడుతున్నాయి. కరెంట్ కోతలు మొదలయ్యాయి. అనేక సమస్యలు జనాన్ని వెంటాడుతున్నాయి. కళాకారులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని నాకు చెప్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతామని చెప్పారు. కళాకారులు కూడా సామాజిక బాధ్యతగా పోరాడాలని, మళ్లీ మీ పెన్నులకు పదును పెట్టాలని హరీశ్‌ కోరారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ వికాస సమితి, చేతన సాహితీ సమాఖ్య సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి కవి, గాయకులు, శాసనమండలి సభ్యులు దేశ పతి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా.. తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్‌, మల్లావఝల విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Raju

Raju

Writer
    Next Story