వయనాడ్ బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

కేరళలోని వయనాడ్ బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్ మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఎయిరియల్ సర్వే నిర్వహించారు.

Kerla
X

కేరళలోని వయనాడ్ బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్ మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఎయిరియల్ సర్వే నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో కలిసి సహాయ శిబిరాలను సందర్మించారు. రెస్క్యూ టీమ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషాదంలో దాదాపు 300 మంది పైగా మరణించారు. ఈ సందర్బంగా పునరావస కేంద్రంలో తలదాచుకున్న బాధితులతో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్బంగా బాధితులు ప్రధానికి తమ బాధలు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యారు..

అనంతరం కాల్ పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ టీమ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మమద్ ఖాన్, కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహాజ వాయువు శాఖల సహాయ మంత్రి సురేశ్ గోపి తదితరులు ఉన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story