పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండి

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్నే ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది.

పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండి
X

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్నే ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌ గేట్లలో ఒకటి పనిచేయకపోవడం తో గురువారం రాత్రి 7.40 నిమిషాల సమయంలో కట్ట తెగింది.

మధ్యాహ్నం 3 గంటలకు కట్ట పైనుంచి వరద ప్రవహించింది. ఏ క్షణమైనా ఆనకట్టకు గండిపడుతుందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఊహించినట్టే రాత్రి 7.45 గంటలకు భారీ గండి పడింది. అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 28 మంది వరదలో చిక్కుకున్నారు. వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయం మంత్రి తుమ్మలకు తెలియడంతో వెంటన్‌ సీఎం కార్యదర్శి శేషాద్రితో, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఏపీ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌తో మాట్లాడారు. దాంతో రెండు హెలికాపర్టర్లు చేరుకుని 22 మందిని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

పెద్దవాగుకు గండితో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోర రంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు కొంత నష్టం జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడుమండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్‌, సొందగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది.

కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టడానికి వరద ప్రభావిత ప్రాంతాకలు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండాపోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. సుమారు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

పెద్ద వాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమార్‌ ఆదేశించింది. జిల్లా కలెక్టర్‌ జితేష్‌, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. గండి పూడ్చడానికి రూ. 20 కోట్ల వరకు ఖర్చవుతుందని జల వనరుల డీఈ కృష్ణ తెలిపారు. ఘటనాస్థలిని సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ సురేశ్‌ సందర్శించారు.

Raju

Raju

Writer
    Next Story