పారిస్ ఒలింపిక్స్‌...జావెలిన్ త్రో ఫైన‌ల్లో నీర‌జ్‌ చోప్రా

పారిస్ ఒలింపిక్స్‌లో జూవెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. క్వాలిఫయర్ రౌండ్‌లో చోప్రా జూవెలిన్‌ను 89.34 దూరం విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లారు.

Neeraj
X

పారిస్ ఒలింపిక్స్‌లో జూవెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. క్వాలిఫయర్ రౌండ్‌లో చోప్రా జూవెలిన్‌ను 89.34 దూరం విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆగస్టు 8న జరిగే పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్ కోసం నీరజ్ అమీతుమీ తెల్చుకోనున్నారు. తొలి ప్ర‌య‌త్నంలోనే అంత దూరం బ‌డిసెను విసిరి ప‌త‌కం వేట‌లో అడుగు ముందుకేశాడు. చోప్రాకు ఇది కెరీర్‌లోనే రెండో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం.

డిఫెండింగ్ చాంపియ‌న్ నీర‌జ్ చోప్రా ఒలింపిక్స్‌లో మ‌రోసారి అదిరే ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. నాలుగేండ్ల క్రితం టోక్యోలో (87.58 మీట‌ర్ల) బంగార పత‌కంతో ఈ బ‌డిసె వీరుడు చ‌రిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడ‌ల్లో గోల్డ్ మెడ‌ల్ కొల్ల‌గొట్టిన తొలి భార‌త‌ అథ్లెట్‌గా రికార్డు పుట‌ల్లోకి ఎక్కాడు. అయితే ఇప్పటివరకు అయితే క్వాలినికేషన్ రౌండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న నీరజ్ చోప్రా ఫైనల్స్ లో ఏవిధమైన ప్రదర్శన చేస్తాడు అనేది వేచి చూడాలి.

Vamshi

Vamshi

Writer
    Next Story