పెట్టుబడుల కోసం ఒరిజినల్ కంపెనీలను తీసుకురావాలి: క్రిశాంక్‌

పెట్టుబడుల కోసం ఒరిజినల్ కంపెనీలను తీసుకురావాలి: క్రిశాంక్‌
X

కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. ఐటీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కానీ 2023 నుండి 2024 వరకు పెట్టుబడులు సగం పడిపోయాయి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దావోస్ వెళ్లి గోదీ ఇండియా అనే సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నారు.అది ఒక ఫ్రాడ్ కంపెనీ అని తేలిందన్నారు.

మూసీ ప్రాజెక్టుపై లక్షన్నర కోట్లకు అంచనాలు పెంచారు. ఆ ప్రాజెక్టు అప్పగించే సంస్థపై లుక్ అవుట్ నోటీసు వచ్చిందని తెలిపారు.తెలంగాణ మహిళలకు ఉపయోగపడే 839 కోట్ల పెట్టుబడి వచ్చిందని వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం కార్యాలయం తెలిపింది. సీఎం అమెరికా పర్యటనలో ఉన్నారు.సీఎం తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని, వాల్ష్ కర్రా హోల్డింగ్స్ నాలుగు నెలల క్రితమే ప్రారంభమైందన్నారు. ఈ కంపెనీకి కేవలం ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. వారిద్దరికీ చెరో యాభై షేర్లు ఉన్నాయి. స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీ తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెడుతుందని ప్రశ్నించారు.

ఫ్రాడ్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళారా అని ప్రశ్నించిన క్రిశాంక్‌..ముఖ్యమంత్రిది ప్రైవేటు పర్యటన కాదు అధికారిక పర్యటన అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజాధనంతో బృందాలుగా అమెరికా,ఆస్ట్రేలియాపర్యటనలకు వెళ్ళారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలంగాణకు పెట్టుబడుల కోసం ఒరిజినల్ కంపెనీలను తీసుకురావాలని కోరారు.

ఇప్పటి వరకు తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బోగస్ కంపెనీలు తెలంగాణ మహిళల కోసం పెట్టుబడులు ఎట్లా పెడతాయి? అని నిలదీశారు. కేటీఆర్ కంటే తాను మెరుగ్గా చేశానని చెప్పడం కోసం సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో ఒప్పందం చేసుకున్నా వారి ట్రాక్ రికార్డ్ మంచిగా ఉండాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story