కేంద్ర బడ్జెట్‌పై విపక్ష పార్టీల నిరసన

విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై బడ్జెట్‌లో విపక్ష చూపెట్టారని ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఇండియా కూటమి నిరసన చేపట్టింది. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కేంద్ర బడ్జెట్‌పై విపక్ష పార్టీల నిరసన
X

పార్లమెంట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బుధవారం చర్చ ప్రారంభమయ్యాయి. మూడోరోజూ విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షపార్టీల సభ్యులు ఉభయ సభల్లో నినాదాలతో హోరెత్తించారు. విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై బడ్జెట్‌లో విపక్ష చూపెట్టారని ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఇండియా కూటమి నిరసన చేపట్టింది. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలోఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ జయా బచ్చన్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Raju

Raju

Writer
    Next Story