రేపు హాస్పిటల్లో ఓపీ సేవలు బంద్

తెలంగాణ వ్యాప్తంగా రేపు హాస్పిటల్లో ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు.

Jr Docotrs
X

తెలంగాణ వ్యాప్తంగా రేపు హాస్పిటల్లో ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యచార ఘటనకు నిరసిస్తూ ఓపీ సేవలను బయ్ కాట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సర్కార్‌కి నోటీసులు అందించారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించే అవకాశం ఉంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనకు నిరసనగా, హాస్పిటల్స్‌లో భద్రతపై సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగిన వైద్యులు మంగళవారం కూడా కొనసాగిస్తున్నారు. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలి హత్య ఘటనకు బాధ్యులైన అధికారులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఈ కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని అని కూడా విజ్ఞప్తి చేసింది. దీంతో నగరంలోని చాలా ఆసుపత్రులలో చికిత్స సేవలు దెబ్బతిన్నాయి. నిరసనల కారణంగా పలువురు రోగులు, వారి బంధువులు అసౌకర్యానికి గురవుతున్నామని చెబుతున్నాయి. మరోవైపు బెంగాల్ వైద్య విద్యార్థి హత్యాచార కేసును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు కలకత్తా పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, దస్త్రాలన్నింటిని రేపు 10 గంటల లోపు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

Vamshi

Vamshi

Writer
    Next Story