పిరికివాళ్లే అట్లా మాట్లాడుతారు: హారిస్
హారిస్ నవ్వు భయంకరంగా ఉంటుందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కమలా కౌంటర్
- By RajuLoading...
- | 19 Aug 2024 3:15 AM GMT
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ డెమోక్రాట్ల, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. అధ్యక్ష బరిలో ఉన్నలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా ర్యాలీలో కమలా హారిస్‌పై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. కమలా హారిస్ కంటే తానే బాగుంటానని, ఆమె నవ్వు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యలపై విమర్శలపై వివాదం చెలరేగుతున్నది.
ఈ నేపథ్యంలో ట్రంప్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వాళ్లంతా పిరికివాళ్లేనని వ్యాఖ్యానించారు. తన రన్నింగ్‌మేట్ టిమ్వాజ్తో కలిసి పెన్సిల్వేనియా ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తున్నది. ఎదుటివారిఇని దెబ్బకొట్టడం అనేది ఒక నాయకుడి చతురతపై ఆధారపడి ఉంటుంది.
నేటి నుంచి షికాగోలో డెమోక్రటిక్ జాతీయ సదస్సు ప్రారంభం కానున్నది.ఈ సదస్సులో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు ఆమోదముద్ర పడనున్నది.