డ్రగ్స్ మాట వినబడాలంటే వణికిపోవాలి : రేవంత్‌రెడ్డి

డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందిస్తున్నాని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM REAVANTH REDDY
X

తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందని.. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం అన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత. అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని అన్నారు. డగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందినికేటాయించామని.. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తామని తెలిపారు.

ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం. మీడియా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నా. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. ప్రతీ సినిమా థియేటర్‌లో మూవీ స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఫ్రీగా ప్రదర్శించేలా చూడాలి. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుంది. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.


Vamshi

Vamshi

Writer
    Next Story