మరోసారి తడబడిన బైడెన్‌

అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్‌ అంటూ మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తడబడినారు.

మరోసారి తడబడిన బైడెన్‌
X

అమెరికా అధ్యక్షడు బైడెన్‌ మరోసారి తడబడినారు. అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్‌ అంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రెండోసారి అధ్యక్ష బరిలో నిలిచిన బైడెన్‌ పై సొంతపార్టీ, విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

నాటో దేశాల వార్షిక సదస్సు తర్వాత బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి మీరు వైదొలిగితే కమలాహారీస్‌ ట్రంప్‌ను ఓడించగలరని భావిస్తున్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

అధ్యక్షుడిగా పనిచేసే అర్హత ఉపాధ్యాక్షుడు ట్రంప్‌నకు లేకుంటే ఆయనను ఆ పదివికి ఎంపిక చేసే వాడినే కాదన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ బదులు ట్రంప్‌ అన్నారు. మీడియా సమావేశానికి ముందు నాటో సభ్య దేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని పరిచయం చేసిన బైడెన్‌ ఆ సమయంలో ఆయనను ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్‌ అని సంభోదించారు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా అవాక్కాయ్యారు జెలెన్‌ స్కీ మాత్రం నవ్వుతూ.. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సమావేశం అనంతరం వివిధ దేశాల నేతలు బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు సహజమే అన్నారు.

Raju

Raju

Writer
    Next Story