ఒలింపిక్స్ : భారత హాకి జట్టుకు మరో గెలుపు

ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మరి విజయం అందుకుంది.

Hockey
X

పారిస్ ఒలిపింక్స్‌లో భారత పురుషుల హాకి జట్టు మరో విజయం సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే కెప్టెన్ హర్మాన్ప్రీత్ సింగ్ గోల్.. చేయగా.. 13 వ నిమిషంలో కెప్టెన్ రెండో గోల్ వేసాడు. దాంతో చివరి వరకు 2-0 లిడ్ ను కాపాడుకుంటూ వచ్చిన భారత్ ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా విజయం అందుకుంది. ఇక నేడు చేసిన రెండు గోల్స్ తో భారత కెప్టెన్ 2024 ఒలంపిక్స్ లో మొత్తం 4 గోల్స్ సాధించాడు.

అయితే పస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చివరి నిమిషంలో మూడో గోల్ వేసి విజయం అందుకున్న భారత జట్టు.. నిన్న అర్జెంటీనాపై కూడా చివరి రెండు నిమిషాల్లో గోల్ చేసి మ్యాచ్ ను డ్రా చేసుకుంది.ఇక ఈరోజు ఐర్లాండ్ పై మాత్రం సునాయాస విజయం అందుకుంది అనే చెప్పాలి. దీంతో తర్వాతి రౌండ్‌కు వెళ్లేందుకు భారత్‌కు అవకాశలు మెరుగయ్యాయి. భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో ఆడనుంది. మరోవైపు అర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ అర్చర్ భజన్‌కోర్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఈ రోజు జరిగిన రెండు గేముల్లో గెలుపు పొందింది. తొలుత ఇండోనేషియన్ అర్చర్‌పై 7-3 తేడాతో విజయం సాధించి 32 రౌండ్‌కు చేరుకున్నఆమె, ఆ తర్వాత పోలీసు అర్చర్‌పై 6-0తో నెగ్గి రౌండ్ 16కి అర్హత సాధించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story