దేవర మూవీ నుంచి ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
దేవర మూవీ యూనిట్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని క్యాప్షన్ ఇచ్చారు.
- By VamshiLoading...
- | 27 Aug 2024 5:44 AM GMT
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ జంటగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం దేవర మరో నెల రోజుల్లో ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. మూవీ యూనిట్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాలో తారక్ రెండు రకల లుక్‌లో కనిపించానున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశాయి. మిలియన్ల కొద్ది రీల్స్ రూపంలో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగులు చేసారు. అటు ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. సెప్టెంబరు 27న తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా అదే టైమింగ్ కు వేయబోతున్నారు. ఇప్పటికే యూకేలో దేవర సినిమా టిక్కెట్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.