ఎన్‌టీఏ డైరెక్టర్‌కు ఉద్వాసన.. నీట్‌ యూజీ పై సీబీఐ దర్యాప్తు

నీట్‌ యూజీ, యూజీసీ సెట్‌ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎన్‌టీఏ డైరెక్టర్‌ కు ఉద్వాసన పలికింది. నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ఎన్‌టీఏ డైరెక్టర్‌కు ఉద్వాసన.. నీట్‌ యూజీ పై సీబీఐ దర్యాప్తు
X

నీట్‌ యూజీ, యూజీసీ సెట్‌ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలతోపాటు విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ వివాదంపై విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రుల ఇండ్లను, క్యాంపు కార్యాలయాలను ముట్టిస్తున్నారు. నీట్‌ పరీక్షను రద్దు తిరిగి నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో నేడు (ఆదివారం) జరగాల్సిన నీట్‌ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీనితోపాటు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికింది. నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్‌ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. త్వలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

వాయిదా వల్ల విద్యార్థులకు కలిగిన ఇబ్బందులకు చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నది. అయితే ఆదివారమే పరీక్ష కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాల నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. శనివారం రాత్రి పరీక్ష వాయిదాను కేంద్ర ప్రకటించడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చేసేది ఏమీ లేక వెనుదిరిగారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలను కేంద్ర వేగవంతం చేసింది. ఆయనను సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. భారతవాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) చైర్మన్‌, ఎంపీ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్టీఏ బాధ్యతలు అప్పగించింది. నీట్‌ యూజీతోపాటు యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపనున్నది.

Raju

Raju

Writer
    Next Story