నోటిఫికేషన్‌ బీఆర్‌ఎస్‌ది.. ప్రచారం రేవంత్‌ది

డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృథా చేయడంపై నిరుద్యోగులు, ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు.

నోటిఫికేషన్‌ బీఆర్‌ఎస్‌ది.. ప్రచారం రేవంత్‌ది
X

గత ప్రభుత్వం ఐదు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు చేసి దానికి అదనంగా మరో 5900 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పార్టీ మెగా డీఎస్సీ ఇస్తామని, మొదటి క్యాబినెట్‌లోనే దానికి ఆమోదం తెలుపుతామని రేవంత్‌ సర్కార్‌ నమ్మబలికి నిరుద్యోగులను నిండా ముంచింది. మెగా డీఎస్సీ వేయకపోగా.. సిలబస్‌ చాలా ఉన్నదని ప్రిపరేషన్‌కు కొంత సమయం ఇవ్వాలన్న విజ్ఞప్తిని పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తున్నది.

నిరుద్యోగులను అన్నిరకాలుగా మోసం చేసిన రేవంత్‌ ప్రభుత్వం ప్రచారంలో మాత్రం నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని నగరంలో పెద్దపెద్ద హోర్డింగ్ లు పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా 11,020 వెలువడిన మెగా డీఎస్సీ అని అందులో పేర్కొన్నది. డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృథా చేయడంపై నిరుద్యోగులు, ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు. మెగా డీఎస్సీ ఎప్పుడు వేశారు? అనే సందేహం వచ్చేలా ఆ హోర్డింగుల ప్రచారం ఉన్నది మరి.

పదేళ్ల కాలంలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కూడా ఇంతగా ప్రచారం చేసుకోలేదని జనాలు అంటున్నారు. రేవంత్‌ రెడ్డి మాత్రం తనకు తానే నిరుద్యోగులకు ఏదో మేలు చేసినట్టు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం ముక్కున వేలేసుకుంటున్నారు. పైసా పని చేయకుండా ఈ ప్రచారం చేసుకోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story