జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆమ్రపాలికి నోటీసులు

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భగనులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు ఇచ్చింది.

Amrapali
X

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భగనులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు జ‌రుపుతుండ‌డంతో దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాశారు. డే&నైట్ అనే తేడా లేకుండా పేలుళ్లు నిర్వహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

నైట్ పెద్ద శ‌బ్ధాలు వ‌స్తుండ‌డంతో స‌మీప ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని లేఖ‌లో తెలిపారు. ఈ లేఖ‌ను న్యాయ‌స్థానం ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంగా స్వీక‌రించి నేడు విచార‌ణ జ‌రిపింది. అనంత‌రం ప‌ర్యావ‌ర‌ణ‌, భూగ‌ర్భ గ‌నులు, పుర‌పాల‌క శాఖ చీఫ్ సెక్ర‌ట‌రీల‌తో పాటు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ల‌ను ప్ర‌తివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంట‌నే వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా వారికి నోటీసులు జారీ చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story