వాళ్లు ఎన్ని మాటలు తొలిగించినా చివరికి సత్యమే గెలుస్తుంది: రాహుల్‌

విపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలోని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీనిపై స్పందించిన రాహుల్‌ వారు ఎంత కావాలంటే అంత తొలిగించుకోవచ్చని, కానీ సత్యమే గెలుస్తుందన్నారు.

వాళ్లు ఎన్ని మాటలు తొలిగించినా చివరికి సత్యమే గెలుస్తుంది: రాహుల్‌
X

ప్రధాని మోడీ తన ప్రపంచంలో నిజాలను తొలిగించగలరు కానీ వాస్తవ ప్రపంచంలో కాదని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. సోమవారం నాటి తన లోక్‌సభ ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు తొలిగించడంపై రాహుల్‌ ఈ మేరకు స్పందించారు.

పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ముందు రాహుల్‌ గాంధీ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాను ఏం చెప్పినా అది పూర్తి నిజమని ఆయన వివరించారు. వారు ఎంత కావాలంటే అంత తొలిగించుకోవచ్చని, కానీ సత్యమే గెలుస్తుందన్నారు.

నిన్న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇవి వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ 24 గంటలూ హింసను ప్రేరేపిస్తుందని ఆరోపించారు. హిందూ సమాజం అంటే ఒక్క మోడీ కాదని, హిందు సమాజం అంటే ఒక్క బీజేపీ, ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదని రాహుల్‌ ఘాటుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అధికారపక్షం అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్‌ ఆయనపై చర్యలు తీసుకున్నారు. హిందు మతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు,అగ్నివీర్‌, మోడీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్‌ చేసిన మాటలను రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం పేర్కొన్నది.

Raju

Raju

Writer
    Next Story