ఈ బడ్జెట్తో రైతులకు ప్రయోజనం శూన్యం : రాకేష్ టికాయత్

2024-2025 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌పై కిసాన్ యూనియన్ నేత నేత రాఖేష్ టికాయత్ మండిపడ్డారు

Rakesh
X

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత నేత రాఖేష్ టికాయత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం ఫ్రీ కరెంట్, నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు మేలు జరగాలంటే ప్రభుత్వమే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఉచిత విద్యుత్తు, నీరు తోపాటు తక్కువ ధరకే ఎరువులు అందించాలన్నారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించాలని కోరారు రాఖేష్ టికాయత్.

పాల ఉత్పత్తిలో నిమగ్నమైన మహిళలకు భూమి లేని వారని.. వారికి ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. ఏడాదిలో పాల ధరలు కూడా పడిపోయాయన్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకోసం , వారి ఆరోగ్యానికి సంబంధించి, గ్రామీణ ఆరోగ్యానికి ఎలాంటి పథకాలు కేటాయించలేదని రాకేష్ టికాయత్ అన్నారు. ఈ బడ్జెట్ కాగితాలపై చూడటానికి మంచిగానే ఉంటుంది.. ఆచరణలోకి వచ్చేటప్పటికీ రైతులకు ఎలాంటి మేలు జరగదని అన్నారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్పించే కంపెనీలు ఈ బడ్జెట్ తో ప్రయోజనం పొందబోతున్నాయన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story