హైదరాబాద్‌‌లో కొత్త వైరస్ వ్యాప్తి .. రోజుకు 100పైగా కేసులు!

వర్షాకాలం కావడంతో ప్రాణాంతకమైన వైరస్‌లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త వైరస్ హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. ఓల్డ్ సిటీలో రోజుకు 100 కేసులు నమోదవుతున్నాయి.

New Virus
X

తెలంగాణలో ప్రజలకు హెల్త్ డిపార్ట్మెంట్ బిగ్ అలర్ట్ ప్రకటించింది. కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోలేదు అప్పుడే మరో వైరస్ కలకలం రేపుతున్నాది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్ హైదరాబాద్ లోనూ విస్తరిస్తున్నది. రోజుకు 100 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేసింది. నొరో వైరస్ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలంటూ శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు సూచనలు చేసింది. కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ రోగం వ్యాప్తి చెందుతుందని పేర్కొంది.

చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని తెలిపింది. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, కాచి చల్లాల్చి వడపోసిన నీటిని తాగాలి. ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం ఈ నొరో వైరస్ కేసులు హైదరాబాద్ పాత బస్తీలోని యాకత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలీ, మొఘల్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారు ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story