సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి: సీఎం రేవంత్‌

ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ లో సీఎం వ్యాఖ్యలు

సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి: సీఎం రేవంత్‌
X

సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ కు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీఐ ఆధారిత ఏఐ క్లౌడ్‌ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందన్నారు. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ - ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని సీఎం తెలిపారు. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం అన్నారు.

కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్ని తీసుకొస్తాయి. అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం. దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయామన్నారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్‌ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామన్నారు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు... భవిష్యత్తును సృష్టిస్తామని సీఎం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నాం. నాస్కామ్‌ సహకారంతో ఏఐ ఫ్రేమ్‌ వర్క్‌కు రూపకల్పన జరుగుతున్నదన్నారు. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నది. అందరం కలిసి కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని సీఎం పిలుపునిచ్చారు.

Raju

Raju

Writer
    Next Story