నీట్‌ యూజీ తుది ఫలితాలు విడుదల

సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం సవరించిన నీట్‌ తుది ఫలితాలను విడుదల చేసింది.

UGC Results
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు ఎన్టీయే వెల్లడి చేసింది. ఓ భౌతికశాస్త్ర ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కును తొలగిస్తూ, తాజా ఫలితాలను విడుదల చేసింది. నీట్ యూజీ ప్రశ్నాపత్నంలో 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది.

దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా... ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ నుంచి సూచనలు తీసుకున్న సుప్రీంకోర్టు... ఆప్షన్ 4ను టిక్ చేసిన వారికే మార్కులు ఇవ్వాలని తీర్పు వెలువరించింది.విద్యార్థులు exams.nta.ac.in. వెబ్ సైట్ లో తాజా ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఝూర్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన నిందితుడు 16 ఫోన్లును సీబీఐ అధికారులు చెరువులోంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని బీహార్‌లోని పట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా విచారణ నిమిత్తం జులై 30 వరుకు న్యాయస్థానం కస్టడీకి అప్పగించింది.

Vamshi

Vamshi

Writer
    Next Story