నీట్‌ యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా

పేపర్ లీక్ వివాదం కారణంగా నీట్‌-యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా పడింది. కొత్త తేదీల ఎన్టీఏ ఇంకా ప్రకటించలేదు.

నీట్‌ యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా
X

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేథ్యంలో శనివారం నుంచి చేపట్టాల్సిన నీట్‌ కౌన్సిలింగ్‌నునేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నది. నీట్‌ కౌన్సిలంగ్‌ వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మే 5న నీట్‌ పరీక్ష ను ఎన్‌టీఏ నిర్వహించింది. నీట్‌ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్టు ఇటీవల ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంగ్‌ రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. లీకేజీవల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన నీట్‌ యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా పడింది. మరోవైపు నీట్‌ నిర్వహణపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది.

Raju

Raju

Writer
    Next Story