నీట్ పరీక్ష తేది ప్రకటన.. ఎగ్జామ్ ఎప్పుడంటే ?

నీట్‌ పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదలైంది.

Neet exam
X

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు11న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఎ ప్రకటించింది. ఆగస్టు 11న ఎగ్జమ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. రెండు షిప్టుల్లో పరీక్ష జరగనుంది. పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం, సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడం, అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్షపైనా పడింది. దాంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను రీషెడ్యూల్‌ చేసి నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు సిద్ధమైంది.

ఆ మేరకు తేదీని ప్రకటించింది. ఈ నెల 11న రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి నీట్ యూజీ వివాదాల కారణంగా వాయిదా పడింది. పలు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీకుల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story